కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన

ABN , First Publish Date - 2022-06-08T05:04:41+05:30 IST

కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనను అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అని టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

చిన్నశంకరంపేట/చేగుంట, జూన్‌ 7: కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనను అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అని టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని సర్పంచ్‌ నీరజా పవన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. నార్సింగి మండలం సంకాపూర్‌లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు మన బడితో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సూరారం హైస్కూల్‌, ప్రాథమీకొన్నత పాఠశాల మరమ్మతుకు రూ. కోటి నిధులను మంజూరు చేశామన్నారు. పాఠశాల మరమ్మతుల కోసం జడ్పీటీసీ మాధవి, ఎంపీపీ భాగ్యలక్ష్మి రూ.2లక్షల చొప్పున విరాళాలను అందజేశారు. కార్యక్రమాల్లో డీఈవో రమేశ్‌కుమార్‌, ఎంపీడీవోలు గణే్‌షరెడ్డి, ఆనంద మేరీ, తహసీల్దార్‌ మహేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజు, ఎంఈవో బుచ్చ నాయక్‌, ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి సర్పంచులు పాల్గొన్నారు.

దళితబంధు పథకంతో ఆర్ధికంగా ఎదగాలి

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 7: సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ మండలంలోని వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని కోంటూర్‌లో దళితబంధు పథకంలో ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన రెండు యూనిట్ల బర్రెల షెడ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యమున, ఆత్మకమిటీ చైర్మన్‌ అంజాగౌడ్‌, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టయ్య, ఎంపీడీవో శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Read more