ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు: జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-09-09T05:13:45+05:30 IST

ఉపాధ్యాయులు సమాజానికి మార్గ నిర్దేశకులని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు: జడ్పీ చైర్‌పర్సన్‌
ఉత్తమ ఉపాధ్యాయులతో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి తదితరులు

చిన్నకోడూరు, సెప్టెంబరు 8: ఉపాధ్యాయులు సమాజానికి మార్గ నిర్దేశకులని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గురువారం గురుపూజోత్సవాన్ని నిర్వహించి, ఉత్తమ సేవలందించిన 17 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడారు. నిత్య విద్యార్థిగా ఉపాధ్యాయులు సమాజంలో మార్పులకు అనుగుణంగా సన్నద్ధమవుతూ ఎంతోమందిని తీర్చిదిద్దుతున్నారన్నారు. శిష్యులు ఉన్నతస్థానంలో ఉంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషపడేది గురువులేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్‌ ఎంపీపీ పాపయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు, సర్పంచ్‌ ఉమే్‌షచంద్ర, ఎంఈవో దేశిరెడ్డి,  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Read more