వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు

ABN , First Publish Date - 2022-03-17T04:49:11+05:30 IST

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు.

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు
పీఆర్టీయూ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

జగదేవ్‌పూర్‌, మార్చి 14 : వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. పీఆర్టీయూ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం మర్కుక్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సంఘం మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు ప్రభుత్వం సూచన ప్రాయంగా అంగీకరించిందని, వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లాలకు పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో విడతలవారీగా రప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఎంఈవో వెంకటేశ్వగౌడ్‌ను ఇతర ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజాం, పత్రికా సంపాదకవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-17T04:49:11+05:30 IST