స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ABN , First Publish Date - 2022-03-17T04:49:46+05:30 IST

హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ పర్యవేక్షకులు ఆర్‌.ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించారు.

స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు

85 రోజులకు కలిపి వచ్చిన ఆదాయం రూ.6,99,679 లక్షలు 

హుస్నాబాద్‌రూరల్‌, మార్చి 16 : హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ పర్యవేక్షకులు ఆర్‌.ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించారు. 85 రోజులకు సంబంధించి హుండీని లెక్కించగా రూ.6,99,679 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో విశ్వనాథశర్మ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.3,54,843 లక్షలు అదనంగా సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయాన్ని దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్లు చెప్పారు. ఈ హుండీ లెక్కింపులో సర్పంచ్‌, ఎంపీటీసీ, శ్రీసత్యాసాయి సేవాసమితి సభ్యులు, హుస్నాబాద్‌ ఆర్యవైశ్య మహిళా విభాగం సభ్యులు, వనితా క్లబ్‌ హుస్నాబాద్‌ సభ్యులు, అలివేలు మంగ భజనమండలి సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Read more