సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

ABN , First Publish Date - 2022-10-04T05:12:59+05:30 IST

సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌
సంగారెడ్డిలో రోడ్లు శుభ్రం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 3: సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి వీరభద్రనగర్‌లో చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుణ, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, జగన్‌, జిల్లా నాయకులు హన్మంతరెడ్డి, మహేందర్‌, నర్సారెడ్డి, మురళీధర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, పవన్‌, యశ్వంత్‌, పట్టణాధ్యక్షుడు రవిశంకర్‌, నర్సింహరెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more