మెదక్‌ సీఎస్‌ఐ బిషప్‌ సాల్మన్‌రాజ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-11-30T00:14:49+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ సీఎ్‌సఐలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్నికల వివాదాలను పరిశీలించి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎ్‌సఐ అత్యున్నత ధర్మాసనం సినాడ్‌ మంగళవారం ఒక లేఖ విడుదల చేసింది.

మెదక్‌ సీఎస్‌ఐ బిషప్‌ సాల్మన్‌రాజ్‌ సస్పెన్షన్‌

ఇన్‌చార్జి బిష్‌పగా రెవరెండ్‌ కె.పద్మారావు నియామకం

అభినందనలు తెలిపిన సంపత్‌ వర్గం

మెదక్‌ కల్చరల్‌, నవంబరు 29: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ సీఎ్‌సఐలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్నికల వివాదాలను పరిశీలించి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎ్‌సఐ అత్యున్నత ధర్మాసనం సినాడ్‌ మంగళవారం ఒక లేఖ విడుదల చేసింది. ఇటీవల జరిగిన పాస్నెట్‌ ఎన్నికల్లో గంట సంపత్‌ ప్యానెల్‌ వర్గానికి చెందిన 11 మంది సభ్యులు గెలుపొందగా, రోలాండ్‌పాల్‌ వర్గం వారు 8 మంది సభ్యులు మాత్రమే గెలుపొందారు. అయినా బిషప్‌సాల్మన్‌ రాజ్‌ తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తక్కువ సీట్లు గెలుపొందిన రోలాండ్‌పాల్‌ వర్గానికి అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆగ్రహించిన గంట సంపత్‌ వర్గం వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంట్లో భాగంగా అత్యున్నతమైన చెన్నైలోని సీనాడ్‌ ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలించిన ధర్మాసనం బిషప్‌ సాల్మన్‌ రాజ్‌ కుట్రపూరితంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించి, సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెండ్‌ చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఇన్‌చార్జి బిష్‌పగా రెవరెండ్‌ కె. పద్మారావు(డోర్నకల్‌) కొనసాగుతారని లేఖ ద్వారా ప్రకటించారు. కాగా గంట సంపత్‌, సంజయ్‌ తదితరులు పద్మారావును సికింద్రాబాద్‌లోని సేయింట్‌ జార్జి చర్చిలో కలిసి అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-11-30T00:14:50+05:30 IST