మహిళల ఆర్థిక బలోపేతంతోనే మనుగడ

ABN , First Publish Date - 2022-02-17T05:00:35+05:30 IST

మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే సమాజం మనుగడ సాగిస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ జేబీ మహాపాత్ర అన్నారు.

మహిళల ఆర్థిక బలోపేతంతోనే మనుగడ

  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ జేబీ మహాపాత్ర


పుల్‌కల్‌, ఫిబ్రవరి 16: మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే సమాజం మనుగడ సాగిస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ జేబీ మహాపాత్ర అన్నారు. పుల్‌కల్‌ మండలం గొంగ్లూరులోని సర్వోదయ మహిళా ఎంటర్‌ ప్రైన్యూర్‌ కాటేజ్‌ ఇండస్ట్రీ్‌సను బుధవారం ఆయన ప్రారంభించారు. గొంగ్లూరు గ్రామాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జేబీ మహాపాత్ర మాట్లాడుతూ... మహిళా సంఘాల సభ్యులు 120 మంది కలిసి వారి స్థోమత మేరకు పెట్టుబడులు పెట్టి స్వయంగా కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వతంత్రంగా ఉద్యోగావకాశాలను కల్పించుకుని మరో పది మందికి దారి చూపించి మార్గనిద్ధేశకులు కావడం గర్వకారణమన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కల్తీలేకుండా, స్వచ్ఛమైన ఉత్పత్తులను తయారీ చేయడం అభినందనీయమన్నారు. కుటీర పరిశ్రమలో తయారు చేస్తున్న నూనె, పప్పు, సబ్బులు తదితర నిత్యావసర ఉత్పత్తులు, వాటిని తయారు చేసే యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. ఆయనవెంట ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుధాకర్‌నాయక్‌, సర్పంచ్‌ రాంసాని లక్ష్మీరామచంద్రారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్‌ పల్లె సరోజాసంజీవయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ రామచంద్రారెడ్డి ఉన్నారు.


 

Read more