అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-17T04:23:26+05:30 IST

అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

మెదక్‌ అర్బన్‌, మార్చి16: అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు... కుమ్మరిగడ్డకు చెందిన చిల్కురి సాయికిరణ్‌(22) తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తల్లి రాజమణి ఓ హోటల్‌లో పనిచేస్తుంది. నాలుగేళ్ల కిత్రం సోదరి పెళ్లి కోసం రూ.4 లక్ష లు అప్పుగా తెచ్చారు. అప్పును తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చే సుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ రాంబాబు తెలిపారు. 

Read more