విద్యార్థులు శాసించే స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2022-09-25T05:16:18+05:30 IST

ప్రతీ విద్యార్థి బాగా చదివి రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదగాలని ములుగు అటవీ కళాశాల డీన్‌ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్‌ పేర్కొన్నారు.

విద్యార్థులు శాసించే స్థాయికి ఎదగాలి
జిజెఎల్‌ అటవీ కళాశాలలో విద్యార్థులకు వివరిస్తున్న ప్రియాంక వర్గీస్‌

ములుగు అటవీ కళాశాల డీన్‌ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్‌ 

ములుగు, సెప్టెంబరు 24: ప్రతీ విద్యార్థి బాగా చదివి రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదగాలని ములుగు అటవీ కళాశాల డీన్‌ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్‌ పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన మెట్టుపాలయం అటవీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్‌ టూర్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌ను సందర్శించి సమీపంలో గల సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని అటవీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్‌ విద్యార్థులకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న హరితహారంపై అవగాహన కల్పించారు. తాను చదువుకున్నది తమిళనాడు మెట్టుపాలయం అటవీ కళాశాలలోనే అని ఆమె తెలిపారు. ఏదో ఒకటి సాధించాలన్న తపనతోనే నేను ఊహించుకున్న నా కలలతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయికి ఎదిగినట్లు ఆమె విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతూ వృక్షాలుగా ఎదగేందుకు, హరితహారం కార్యక్రమం విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు. కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతో శ్రమించాల్సిన వచ్చిందని,  ఆ శ్రమ ఫలితమే నేడు పచ్చటి వృక్షాలకు మూలమన్నారు అంతకుముందు విద్యార్థులకు కళాశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను  విద్యార్థులకు చూపించారు.  ఇక్కడి విద్యార్థులకు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. అదే విధంగానే తమ కళాశాలలో కూడా స్టడీ సర్కిల్‌ ప్రారంభిస్తే బాగుంటుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌సీఆర్‌ఐ చదువు కోసం హైదరాబాదులో పీజీ చేయడానికి పలువురు విద్యార్థులు ఆసక్తి చూపించారని డీన్‌ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు డాక్టర్‌ పి కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫారెస్ట్‌ ఎఫ్‌సీఆర్‌ఐ పాల్గొన్నారు. 

Read more