విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-09-26T04:56:48+05:30 IST

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు.

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
పోటీలను ప్రారంభిస్తున్న రోజాశర్మ, రఘోత్తంరెడ్డి

సిద్దిపేట అర్బన్‌, సెప్టెంబరు 25: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గురుకుల పాఠశాలలో తెలంగాణ మూడోజోన్‌ పరిధిలోని 8వ జోనల్‌స్థాయి క్రీడలను ఎమ్మెల్సీతో ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో పాల్గొంటే మానసిక స్థైర్యం, శారీరక దృఢత్వం వస్తున్నదని చెప్పారు. మూడోజోన్‌కు సంబంధించి 15 పాఠశాలల నుంచి 1,200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ శక్రునాయక్‌, ఆర్‌సీవో నిర్మల, ప్రిన్సిపాల్‌ లక్ష్మాంజలి పాల్గొన్నారు. 

Read more