విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
విజేతలకు బహుమతిని అందజేస్తున్న సునీతారెడ్డిరాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

హత్నూర, సెప్టెంబరు 27: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం హత్నూరలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జూనియర్‌ కళాశాలలో 3 రోజులపాటు నిర్వహించిన జోనల్‌ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల కళాశాల, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర గురుకుల డిప్యూటీ సెక్రటరీ శారద మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సైతం గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు.  క్రీడల్లో విజేతలకు  ప్రథమ, ద్వితీయ బహుమతులను సునీతారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌సీవో భీమయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ వివేకానంద, సర్పంచ్‌ వీరస్వామిగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, పీడీ గణపతి, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ ఆనంద్‌తో పాటు పీటీలు, పీడీలు, ఆయా గురుకుల పాఠశాల, కళాశాలత ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. 


Read more