‘లింగవివక్ష లేని సమాజం కోసం పాటుపడాలి’

ABN , First Publish Date - 2022-03-17T04:24:14+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తాచాటుతున్నప్పటికీ, లింగవివక్షతను సమూలంగా నిర్మూలించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పేర్కొన్నారు.

‘లింగవివక్ష  లేని సమాజం కోసం పాటుపడాలి’

నర్సాపూర్‌, మార్చి 16: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తాచాటుతున్నప్పటికీ, లింగవివక్షతను సమూలంగా నిర్మూలించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏఆర్‌ఈఎస్‌ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో లింగ వివక్షతపై నిర్వహించిన అవగాహనతో పాటు నర్సాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మహిళాకమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైౖర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ నయీమోద్దీన్‌,  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌, సీడీపీవో హేమభార్గవి, కౌన్సిలర్లు, నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

Read more