పోడు భూముల సర్వే ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-09T04:02:22+05:30 IST

హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచునూర్‌ గ్రామ శివారులో గల పోడు భూములను శనివారం అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు.

పోడు భూముల సర్వే ప్రారంభం

 హత్నూర, అక్టోబరు 8: హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచునూర్‌ గ్రామ శివారులో గల పోడు భూములను శనివారం అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ గంగాభవానీ, గ్రామ కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఖాస్తు చేస్తున్న భూముల్లో వారి సమక్షంలోనే సర్వే నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ యాప్‌లో వివరాలను పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కో ఆప్షన్‌ సభ్యుడు వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్‌ నర్సింహారెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 


Read more