టౌన్‌ ప్లానింగ్‌తో అభివృద్ధి వేగవంతం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-29T05:01:36+05:30 IST

టౌన్‌ ప్లానింగ్‌ అనుమలతో పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

టౌన్‌ ప్లానింగ్‌తో అభివృద్ధి వేగవంతం: ఎమ్మెల్యే
కార్యక్రమంలో మాట్లాడుతున్నఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, సెప్టెంబరు 28: టౌన్‌ ప్లానింగ్‌ అనుమలతో పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో టౌన్‌ ప్లానింగ్‌పై జిల్లా, డివిజన్‌, మండల అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఖేడ్‌, మంగల్‌పేట్‌, చాంద్‌ఖాన్‌పల్లి, మన్సూర్‌పూర్‌తోపాటు చుట్టు పక్కల ఉన్న బాణాపూర్‌, జూకల్‌, జూజాల్‌పూర్‌, జగన్నాథ్‌పూర్‌, అంత్వార్‌, కమలాపూర్‌ గ్రామాలను సైతం టౌన్‌ప్లానింగ్‌లో చేర్చాలని సూచించారు. ప్రస్తుతం 40 వేల జనాభా ఉన్నప్పటికీ, రానున్న 20 సంవత్సరాల వరకు పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి అంబిక.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే కోసం త్వరలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఫంక్షన్‌ హాల్‌లో లబ్ధిదారులకు పెన్షన్‌ పత్రాలను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, కమిషనర్‌ మల్లారెడ్డి, అభిషేక్‌ షెట్కార్‌, రవీందర్‌నాయక్‌, సత్యంసేట్‌, కొమ్ముశేఖర్‌, తుకారం, మాజీ ఎంపీటీసీ ముజమ్మిల్‌, కౌన్సిలర్‌ నర్సింహులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్‌ డేను పురస్కరించుకొని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరత్‌సింగ్‌, ప్రిన్సిపల్‌ కళింగక్రిష్ణకుమార్‌ పాల్గొన్నారు. నిజాంపేట మండల సర్పంచులు, నాయకులు బుధవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని  క్యాంపు కార్యాలయంలో కలిసి సన్మానించారు. జాతీయ రహదారిపై ఉన్న నిజాంపేటను మండల కేంద్రంగా ప్రకటించడంతో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, సర్పంచులు జగన్‌చారి, నాయకులు బాపురాజ్‌, ఈశ్వర్‌, నవాబ్‌పటేల్‌, పుట్టి అంజయ్య, రవీందర్‌నాయక్‌, విఠల్‌నాయక్‌, వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-09-29T05:01:36+05:30 IST