ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-08-22T05:27:30+05:30 IST

సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఇర్కోడ్‌ గ్రామ శివారులో నిర్మించిన ఆలయంలో ఆదివారం రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ విగ్రహాల ప్రతిష్టపన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు
చేర్యాలలో బోనాల ఊరేగింపు

సిద్దిపేట రూరల్‌/రాయపోల్‌, ఆగస్టు 21: సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఇర్కోడ్‌ గ్రామ శివారులో నిర్మించిన ఆలయంలో ఆదివారం రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ విగ్రహాల ప్రతిష్టపన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాయపోల్‌ మండలం రాంసాగర్‌ గ్రామంలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొండారి సంధ్యారాణిగణేష్‌, ఎంపీటీసీ సాయొల్ల లక్ష్మీయాదగిరి, ఉప సర్పంచ్‌ రాజిరెడ్డి, ఆలయ చైర్మన్‌ చిట్టమైన పోచయ్య, రమేష్‌, దుర్గయ్య, రాజు, శ్రీను, వడ్ల యాదగిరి, స్వామి పాల్గొన్నారు. 

చేర్యాల: చేర్యాల పట్టణంలో ఆదివారం గ్రామదేవతలకు బోనాల పండుగ నిర్వహించారు. మహంకాళమ్మ, పోచమ్మ, బీరప్ప, పెద్దమ్మ, ముత్యాలమ్మ, గడిమైసమ్మ దేవతలకు బోనాలు నివేదించారు. మహిళలు బోనాలతో డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా దేవాలయాలకు వెళ్లి బోనం సమర్పించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కొమురవెల్లి మండలం అయినాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం ఘనంగా కొనసాగాయి. చేర్యాల పట్టణంలో దుర్గమ్మ ఆలయ నిర్మాణానికి కులసంఘాల పెద్దలు భూమిపూజ నిర్వహించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, నచ్చిమడ్ల సతీశ్‌, మంగోలు చంటి, ఉడుముల ఇన్నమ్మ పాల్గొన్నారు.


 

Updated Date - 2022-08-22T05:27:30+05:30 IST