మా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడండి

ABN , First Publish Date - 2022-09-11T04:48:36+05:30 IST

తమ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, పరిష్కారమయ్యేలా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును వీఆర్‌ఏలు కోరారు.

మా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడండి

  దుబ్బాక ఎమ్మెల్యేకు వీఆర్‌ఏల వినతి


చేగుంట, సెప్టెంబరు 10: తమ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, పరిష్కారమయ్యేలా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును వీఆర్‌ఏలు కోరారు. శనివారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేతో వాపోయారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, తప్పకుండా అసెంబ్లీలో మొదట ఈ అంశం మీదే మాట్లాడుతానని హామీ ఇచ్చారని వీఆర్‌ఏలు తెలిపారు.


 

Read more