రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌ మెదక్‌

ABN , First Publish Date - 2022-11-20T23:56:45+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంఫియన్‌షిప్‌ పోటీల్లో మెదక్‌ జిల్లా బాలుర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.

రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌ మెదక్‌

తూప్రాన్‌, నవంబరు 20: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంఫియన్‌షిప్‌ పోటీల్లో మెదక్‌ జిల్లా బాలుర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం నిర్వహించిన ముగింపు పోటీల్లో క్రీడాకారులు కప్పును అందుకున్నారు. సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంఫియన్‌షిప్‌ పోటీల్లో మెదక్‌ జిల్లా జట్టు మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ప్రతిభ చూపించింది. ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నిజామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి 10- 3తో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌ బెస్ట్‌ ప్లేయర్‌గా జిల్లాకు చెందిన మహిపాల్‌ ఎంపికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి శోభన్‌బాబు, కోశాధికారి అభిషేక్‌గౌడ్‌, మెదక్‌ జిల్లా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. జట్టు శిక్షకులు శానవాజ్‌, లింగం, శోభన్‌నాయక్‌ను జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణగుప్తా, ప్రధానకార్యదర్శి శ్యాంసుందర్‌శర్మ అభినందించారు.

ఉత్సహంగా పుట్‌బాల్‌ పోటీలు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 20: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీల ప్రారంభ నేపథ్యంలో ఆదివారం స్థానిక ఇందిరాగాంధీ మైదానంలో మెదక్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యవజన క్రీడల అధికారి నాగరాజు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో నాలుగు జట్లు పాల్గొనగా రామాయంపేట, మెదక్‌ జట్టు పైనల్‌కు చేరాయి. ఫైనల్‌లో రామాయంపేట జట్టు 1-0 తేడాతో మెదక్‌పై విజయం సాధించింది. కార్యక్రమంలో మెదక్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్యదాస్‌, ప్రశాంత్‌, రెఫరీ వినయ్‌, కోచ్‌ వంశీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:59:29+05:30 IST

Read more