పని కల్పించేందుకే సామాజిక తనిఖీ

ABN , First Publish Date - 2022-11-03T00:07:37+05:30 IST

హక్కు దారులకు పని కల్పించేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

పని కల్పించేందుకే సామాజిక తనిఖీ

కౌడిపల్లి, నవంబరు 2: హక్కు దారులకు పని కల్పించేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్టు డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మార్చి 2019 నుంచి మార్చి 2022 వరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 22.23 కోట్ల పనులు జరిగాయని వివరించారు. బుధవారం పనులపై 13 విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీ ప్రదీప్‌ కుమార్‌, క్యూసీ రమాకాంత్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారి శ్రీహరి, ఎంపీపీ రాజునాయక్‌, ఎంపీడీవో భారతి, ఏపీవో పుణ్యదా్‌సతో పాటు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు హాజరయ్యారు.

కొట్టాలలో ‘ఉపాధి’ నిధులు గోల్‌మాల్‌

కౌడిపల్లి: మహత్మాగాంధీ ఉపాధి హామి తనికలో భాగంగా మండల పరిధిలోని కొట్టాల గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున మొక్కల పేరుతో నీటి బిల్లును స్వాహా చేశారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో 44 వేల మొక్కలను నాటినట్లు రికార్డులో రాసి మొక్కలను అటవీ ప్రాంతంలో పారవేశారని, వాటి సంరక్షణకు గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు పాలక వర్గసభ్యులు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరున బిల్లులు తీసుకుని స్వాహా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. మొక్కల సంరక్షణ పేరిట 16.30లక్షలు, పంచాయతీ చెరువులో పూడిక తీత కోసం రూ.4.20లక్షల నిధుల బిల్లులను తీసుకున్నట్టు ఆడిట్‌ అధికారులు ధ్రువీకరించారు. కాగా ఈ పనుల్లో నిధుల స్వాహా జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - 2022-11-03T00:07:39+05:30 IST