చివరి ఆయకట్టుకూ సింగూరు జలాలు

ABN , First Publish Date - 2022-09-12T04:30:58+05:30 IST

చివరి ఆయకట్టు వరకు కూడా సింగూరు జలాలను అందిస్తామని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఆదివారం ఉప్పరిగూడెం గ్రామ శివారులోని పలు చెరువులు, కుంటలకు సింగూరు జలాలను అందించేందుకు ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన డీ6 కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.

చివరి ఆయకట్టుకూ సింగూరు జలాలు
డీ6 కెనాల్‌ వద్ద పూలు చల్లుతున్న అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

  బీడు భూముల్లో పచ్చటి పంటల సాగు

 అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌


పుల్‌కల్‌, సెప్టెంబరు 11: చివరి ఆయకట్టు వరకు కూడా సింగూరు జలాలను అందిస్తామని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఆదివారం ఉప్పరిగూడెం గ్రామ శివారులోని పలు చెరువులు, కుంటలకు సింగూరు జలాలను అందించేందుకు ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన డీ6 కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. గొంగ్లూరు గిరిజన తండా నుంచి ఉప్పరిగూడెం గ్రామం వరకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కోమటి చెరువులోకి డీ6 కెనాల్‌ను తవ్వించడం శుభపరిణామమన్నారు. చెరువులోకి సింగూరు జలాలు వచ్చేలా ఉప్పరిగూడెం సర్పంచ్‌ అల్వాల రేణుకనర్సింహులు శ్రమించారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రశంసించారు. సింగూరు జలాలతో బీడు భూముల్లో పచ్చటి పంటలు సాగవుతాయన్నారు. ప్రజా ప్రతినిధులకు పట్టుదల, చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలన్నారు. సర్పంచ్‌ అల్వాల రేణుకనర్సింలు కృషి, పట్టుదల వల్లనే ఉప్పరిగూడెంకు సింగూరు జలాలు వచ్చాయని గుర్తు చేశారు. డీ6 కెనాల్‌ ద్వారా సింగూరు జలాలు రావడంతో చౌటకూర్‌, ఉప్పరిగూడెం, బద్రిగూడెం, శేరింరారెడ్డిగూడెం గ్రామాల పరిధిలో దాదాపుగా వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ డీ6 కెనాల్‌ తూము ద్వారా సింగూరు జలాలను విడుదల చేసి ప్రత్యేక పూజలు చేపట్టి, గంగమ్మకు పూలు చల్లి నమస్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్‌ అల్వాల రేణుకనర్సింలు సన్మానించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఏఈఈ మహేశ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యురాలు, మాజీ సర్పంచ్‌ అయ్యవారి పుష్పలతనగేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్‌, నాయకులు పట్లోళ్ల విజయభాస్కర్‌రెడ్డి, గొల్ల శివకుమార్‌, గంగోజిపేట సర్పంచ్‌ బుర్రెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పట్లోళ్ల మాణిక్యరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సంకేపల్లి నర్సింలు పాల్గొన్నారు.


ఆరోగ్యకరమైన గురుకులాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం


మునిపల్లి, సెప్టెంబరు 11: ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకులాల విద్యాలయాలను తీర్చిద్దిడమే ప్రభుత్వ లక్ష్యమని అందోల్‌ ఎమ్మేల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గురుకుల్‌ ముగింపు కార్యక్రమం ఆదివారం బుధేరా గురుకులంలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరిశుభ్రతపై ప్రదర్శించిన నాటకాలు, పిరమిడ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 5 నుంచి 11 వరకు చేపట్టిన కార్యక్రమాలను విద్యార్థులు వివరించారు. మంచి ఫలితాలు సాధించి తల్లి దండ్రుల ఆశలు నెరవేర్చాలని ఎమ్మేల్యే విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధ్యాపకులను కోరారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మాధవి, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్‌, ఎంపీడీవో రమే్‌షచంద్రకులకర్ణి, నాయకులు సాయికుమార్‌, బాబుపాటిల్‌, చంద్రయ్య, సతీ్‌షకుమార్‌, శశికుమార్‌, అశోక్‌గౌడ్‌, పరశురాం, మౌలానా పాల్గొన్నారు.


 

Read more