శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-02-20T04:26:51+05:30 IST

హిందుత్వాన్ని రక్షించడానికి ఛత్రపతి శివాజీ కంకణం కట్టుకుని, ఆ దిశగా అడుగులు వేశారని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
దుబ్బాకలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

పలు మండలాల్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

దుబ్బాక/మిరుదొడ్డి, ఫిబ్రవరి 19 : హిందుత్వాన్ని రక్షించడానికి ఛత్రపతి శివాజీ కంకణం కట్టుకుని, ఆ దిశగా అడుగులు వేశారని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శనివారం శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బీజేపీ నాయకులతో కలిసి పూలమాల వేశారు. అనంతరం బీజేపీ, వీహెచ్‌సీ, భజరంగ్‌దళ్‌ నాయకులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్దగుండవెళ్లి శ్రీరామసేనా, పెద్దచీకోడ్‌లో సర్పంచ్‌ తౌడశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. మిరుదొడ్డి మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే ఆరెపల్లిలో ఛత్రపతి వారసులైన ఆరెకులస్తుల ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. మోతెలో సర్పంచ్‌ వంజరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వేడుకలను నిర్వహించారు. 

సిద్దిపేట క్రైం: శివాజీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం హిందువాహినీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హిందువాహినీ కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకురాళ్లు, భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, ఏబీవీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హిందువాహినీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సిద్దిపేటలోని రేణుకామాత ఎల్లమ్మ ఆలయం నుంచి బారాహిమామ్‌ చౌరస్తా, మంగమ్మతోట  కాలనీ నుంచి, కోర్టు ముందు నుంచి గాంధీ కమాన్‌ రోడ్డు నర్సాపూర్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ చౌరస్తా, విక్టరీ టాకీస్‌ చౌరస్తా గుండా స్థానిక వేంకటేశ్వర ఆలయం వద్ద ఉన్న శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి పాల్గొన్నారు. అలాగే ర్యాలీ నిర్వహిస్తున్న కాషాయపు కార్యకర్తలకు ఇత్తెహాథ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు అత్తుఇమామ్‌, సయ్యద్‌అతిక్‌ వాటర్‌ బాటిల్స్‌ అందజేశారు. 

సిద్దిపేట టౌన్‌: టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బీజేఆర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, వైశ్యభవన్‌, లాల్‌కమాన్‌, సుభా్‌షరోడ్డు, విక్టరీ చౌరస్తా, కాంచీట్‌ చౌరస్తా, ముస్తాబాద్‌ చౌరస్తా మీదుగా నాగదేవత ఆలయం వద్దకు చేరుకున్నది. కాగా ర్యాలీలో పాల్గొన్న హిందువులకు టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు ఇర్షాద్‌హుస్సేన్‌ తాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, మాజీ చైర్మన్‌ రాజనర్సు, నాయకులు పాల్గొన్నారు.

సిద్దిపేట అర్బన్‌ : పోరాటయోధుడు శివాజీ అని సిద్దిపేట వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిండి అరవింద్‌, గౌరవాధ్యక్షుడు బొమ్మల యాదగిరి అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో బైక్‌ ర్యాలీ నిర్వహించి నాగదేవత గుడి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్‌, ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, గౌరవ సలహాదారు దుర్గయ్య పాల్గొన్నారు. అలాగే కుమ్మరి సంఘం వృత్తి విభాగం జిల్లా అధ్యక్షుడు కట్కూరి రవీందర్‌ ఆధ్వర్యంలో 18వ వార్డులో ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్‌ ప్యాకెట్లు అందజేశారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండలంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో మండలంలోని మెట్టుబండల నుంచి సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని రంగధాంపల్లి చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఉమే్‌షచంద్ర, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, పీఏసీఏస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

రాయపోల్‌: మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో యువకులు వీధుల్లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి, శివాజీ విగ్రహానికి పూలమాలవేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకన్న, మాజీ సర్పంచులు వేణుగోపాల్‌, రాజగోపాల్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి పాల్గొన్నారు.

నారాయణరావుపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం శివాజీ జయంతి నిర్వహించారు. ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌, సర్పంచులు పరశురాములు, నారాయణ, దేవయ్య, శంకర్‌, ఎంపీటీసీలు హరీశ్‌, భానుచందర్‌ పాల్గొన్నారు.

వర్గల్‌: వర్గల్‌ మండలంలోని గౌరారం, అనంతగిరిపల్లిలో శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో శివాజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

నంగునూరు: నంగునూరు మండలంలో శివాజీ జయంతి ఉత్సవ సమితి, హిందూ యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ విగ్ర హానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బైక్‌ ర్యాలీ చేపట్టారు. 

కొండపాక: కొండపాక మండలం, కుకునూరుపల్లి గ్రామంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజు, పాండు పాల్గొన్నారు. విశ్వనాథపల్లి రవీంద్రనగర్‌ సర్పంచ్‌ వాసరి లింగారావు ఆధ్వర్యంలో వెలికట్ట క్రాస్‌ రోడ్డు వద్ద వేడుకలు నిర్వహించారు. 

బెజ్జంకి:  మండల కేంద్రంలో శనివారం ఆరె క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శివాజీ నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ నిర్మల, ఎంపీడీవో రాము హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలవేశారు. 

గజ్వేల్‌: గజ్వేల్‌ పట్టణంలోని మహకాంళీ ఆలయం నుంచి వివేకానంద చౌరస్తా, ఇందిరాపార్కు చౌరస్తా వరకు హిందూవాహినీ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్కు చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహినీ సభ్యులు రెక్సీగౌడ్‌, నవీన్‌, నాగరాజుగౌడ్‌, మనోహర్‌యాదవ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌: శివాజీ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చాడ శ్రీనివా్‌సరెడ్డి, వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, సెన్సార్‌ బోర్డు సభ్యుడు లక్కిరెడ్డి తిరుమల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-20T04:26:51+05:30 IST