కష్టాన్ని పంచుకుంటే తగ్గుతుంది

ABN , First Publish Date - 2022-10-13T05:10:58+05:30 IST

ఏదైనా అనుకోని కష్టం ఎదురైనప్పుడు కుటుంబసభ్యులు, ఆప్తులు, అధ్యాపకులతో పంచుకోవాలని లేదా

కష్టాన్ని పంచుకుంటే తగ్గుతుంది
మాట్లాడుతున్న నీలిమ

 సఖి ఇన్‌చార్జి కల్పన, న్యాయవాది నీలిమ


 పటాన్‌చెరురూరల్‌, అక్టోబరు 12: ఏదైనా అనుకోని కష్టం ఎదురైనప్పుడు కుటుంబసభ్యులు, ఆప్తులు, అధ్యాపకులతో పంచుకోవాలని లేదా సమీప సఖి కేంద్రాన్ని సంప్రదించాలని సంగారెడ్డిలోని సఖి కేంద్రం ఇన్‌చార్జి కల్పన, న్యాయవాది నీలిమ గీతం విద్యార్థులకు సూచించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమనిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సైస్‌ (జీఎస్బీఎస్‌), గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (జీఎస్బీ) బుధవారం సంయుక్తంగా నిర్వహించిన సైబర్‌క్రైమ్స్‌, విద్యార్థులపై దాని ప్రభావం అంశంపై వారు మాట్లాడారు. సైబర్‌ క్రైంను అరికట్టి ప్రజాప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు. చట్టం ముందు స్ర్తీ, పురు ష బేధం ఉండదని, అంతా సమానమేనని నేరం రుజువైతే శిక్ష తప్పదన్నారు. విచారకర అంశాలను అసలు షేర్‌ చేయొ ద్దని, దానిని మరొకరు అవకాశంగా మలుచుకుంటారని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం, తాగి డ్రైవ్‌ చేయడం నేరమన్నారు. ఒకసారి శిక్ష పడ్డాక ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశీ వీసా పొందడం అంత సులువు కాదన్నారు. తొలుత గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డెరైక్టర్‌ ప్రొఫెసర్‌ కరుణాకర్‌ అతిథులను స్వాగతించి, సత్కరించారు. డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ దిగుమర్తి, డాక్టర్‌ దివ్య కీర్తి గుప్తాల ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Read more