టాస్క్‌ఫోర్స్‌ దాడిలో 234 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-05-18T05:42:42+05:30 IST

సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం వడ్డేపల్లి సమీపంలోని ఓ పౌలీ్ట్ర ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 234.5 క్వింటాళ్ల బియ్యాన్ని సోమవారం రాత్రి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ దాడిలో 234 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

రాయపోల్‌, మే 17: సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం వడ్డేపల్లి సమీపంలోని ఓ పౌలీ్ట్ర ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 234.5 క్వింటాళ్ల బియ్యాన్ని సోమవారం రాత్రి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ గురుస్వామి ఆధ్వర్యంలో దాడి చేసి మూడు వాహనాల్లో లోడు చేస్తున్న 433 బ్యాగుల పీడీఎస్‌ బియ్యంను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని రాయపోల్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌ పార్థసారథి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి బచ్చు రాములు, బచ్చు సందీప్‌ కుమార్‌, బి. నర్సింహులు, డ్రైవర్లు నర్సింహులు, షేక్‌ తాజుద్దీన్‌, సుబా్‌షపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మాట్లాడుతూ.. రేషన్‌  బియ్యాన్ని కొంతమంది ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రేషన్‌ బియ్యం కొనుగోలు చేసినా, అమ్మినా, అక్రమంగా రవాణా చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Read more