TS News: సంగారెడ్డి టీఆర్‌ఎస్ సంబరాల్లో అపశృతి

ABN , First Publish Date - 2022-11-15T12:06:01+05:30 IST

జిల్లాలో మెడికల్ కాలేజి ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.

TS News: సంగారెడ్డి టీఆర్‌ఎస్ సంబరాల్లో అపశృతి

సంగారెడ్డి: జిల్లాలో మెడికల్ కాలేజి ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. సంగారెడ్డి చౌరస్తా సమీపంలో బైక్ ర్యాలీ సందర్భంగా ఆటోలో టసాసులు ఉంచారు. అయితే ఓ బాణసంచా కాల్చగా ఆటోలో పడింది. దీంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. బాణసంచా పేలిన ఘటనలో చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింతా ప్రభాకర్‌ కాలికి గాయాలయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. చింతాప్రభాకర్‌తో పాటు గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Updated Date - 2022-11-15T12:06:02+05:30 IST