పల్లె ప్రకృతి వనం పనులు భేష్‌

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనం పనులు బాగున్నాయిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

పల్లె ప్రకృతి వనం పనులు భేష్‌
జప్తిసింగాయపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి అరుణ్‌కుమార్‌

తెలంగాణలో అభివృద్ధి అద్భుతం 

ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖ మంత్రి అరుణ్‌కుమార్‌

ములుగు, సెప్టెంబరు 10: రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనం పనులు బాగున్నాయిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లి, ములుగు, నర్సంపల్లిలో పల్లె ప్రకృతివనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచడం, అడవుల పెంపకం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతమని అన్నారు. అలాగే నిరుపేదలకు నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కూడా బాగున్నాయన్నారు. ఆయన వెంట సీసీఎ్‌ఫవో ఆశ, డీఎ్‌ఫవో శ్రీధర్‌రావు, ఎఫ్‌ఆర్‌వో కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, వంటిమామిడి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఏనుగు బాపురెడ్డి, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Read more