గిరిజన తండాల రోడ్లకు రూ.30.13 కోట్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-12-10T00:07:38+05:30 IST

ఖేడ్‌ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో బీటీ రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.30.13 కోట్లను మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు.

గిరిజన తండాల రోడ్లకు రూ.30.13 కోట్లు: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం

నారాయణఖేడ్‌, డిసెంబరు 9: ఖేడ్‌ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో బీటీ రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.30.13 కోట్లను మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 21 గిరిజన తండాలకు 44.55కి.మీ.ల బీటీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే మరికొన్ని తండాల రోడ్ల కోసం రూ.16 కోట్లు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. ఖేడ్‌-సిర్గాపూర్‌-మాసాన్‌పల్లి మధ్య 12కి.మీల మేర రోడ్డు విస్తరణకు రూ.15కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. నిజాంపేట-ఖేడ్‌-బీదర్‌ జాతీయ రహదారి విస్తరణకు టెండర్లు పూర్తి కాగా త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌, కంగ్టి ఎంపీపీ సంగీతవెంకట్‌రెడ్డి, రోషన్‌రెడ్డి, సేవాలాల్‌ సంఘం రాష్ట్ర నాయకులు రమే్‌షచౌహాన్‌, నాయకులు సంగప్ప, నియోజకవర్గంలోని గిరిజన ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గిరిజన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఆరుగురికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

Updated Date - 2022-12-10T00:07:41+05:30 IST