‘ఆర్‌వోఎఫ్‌ఆర్‌’ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి

ABN , First Publish Date - 2022-11-17T00:11:06+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ఆర్‌వోఎ్‌ఫఆర్‌ (రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్‌) కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ పారదర్శకంగా పరిశీలన చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు.

‘ఆర్‌వోఎఫ్‌ఆర్‌’ దరఖాస్తులను పారదర్శకంగా  పరిశీలించాలి
సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

అధికారులు సమన్యయంతో పనిచేయాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డిరూరల్‌, నవంబరు16: సంగారెడ్డి జిల్లాలో ఆర్‌వోఎ్‌ఫఆర్‌ (రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్‌) కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ పారదర్శకంగా పరిశీలన చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు దరఖాస్తులకు సంబంధించి సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ సమావేశాలు పూర్తిచేసి జిల్లా స్థాయి స్ర్కూటిని కమిటీకి పంపించాలని రెవెన్యూ డివిజన్‌ అధికారులకు సూచించారు. సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీల స్ర్కూటినిలో పాటించాల్సిన నిబంధనలు పరిశీలించాల్సిన అంశాలు, ఆర్‌వోఎ్‌ఫఆర్‌ క్లెయిమ్స్‌ ఏ విధంగా చేయాలన్న దానిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్ర్కూటిని చేసిన అనంతరం జిల్లాస్థాయికి పంపాల్సిన క్లెయిమ్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రాపర్‌గా ప్రతిపాదనలు పంపాలని, ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ ఆయా ప్రక్రియలను వేగవంతంగా పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీకి నివేదిక పంపాలని సూచించారు. అటవీ, పంచాయతీ, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, డీపీవో సురే్‌షమోహన్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:11:06+05:30 IST