నక్ష ప్రకారం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-19T04:33:44+05:30 IST

మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామం నుంచి బస్వాపూర్‌ గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను నక్ష ప్రకారం చేపట్టాలని కాంగ్రెస్‌ మండల నాయకులు డిమాండ్‌ చేశారు.

నక్ష ప్రకారం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలి
గ్రామ రెవెన్యూ నక్షను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ మండల నాయకుల డిమాండ్‌

కోహెడ, అక్టోబరు 18: మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామం నుంచి బస్వాపూర్‌ గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను నక్ష ప్రకారం చేపట్టాలని కాంగ్రెస్‌ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం చేపడుతున్న తారు రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించి మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరయ్యాయని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య తెలిపారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు గుండారెడ్డిపల్లి గ్రామం ఒర్రె దగ్గర అధికారులు నక్ష ప్రకారం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. నక్ష ప్రకారం పనులు చేపట్టకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు శెట్టి సుధాకర్‌, బందెల బాలకిషన్‌, వెంకటస్వామి, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more