ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయండి

ABN , First Publish Date - 2022-09-12T04:20:09+05:30 IST

ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు.

ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయండి

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, సెప్టెంబరు 11: ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం దుబ్బాక మున్సిపాలిటీలో పలు వార్డులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 14వ వార్డులో ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న గద్దె నుంచి నూతనంగా నిర్మించిన గద్దెపైకి ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని ఆదేశించారు. అలాగే శిథిలావస్థకు చేరిన స్తంభాలను మార్చి, నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

Read more