పొటాష్‌ లోపంతోనే వరి పొలాల్లో ఎరుపు రంగు వర్ణం

ABN , First Publish Date - 2022-08-18T04:35:27+05:30 IST

పొటాష్‌ లోపం వల్లే వరిపొలాలు ఎర్రబడుతున్నాయని, పంట రక్షణ నివారణకు ఎకరానికి 20-25 కిలోల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలని లేదా 19:19:19: లీటర్‌ నీటికి 10 గ్రాములు పిచికారీ చేయాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి రైతులకు సూచించారు.

పొటాష్‌ లోపంతోనే వరి పొలాల్లో ఎరుపు రంగు వర్ణం

తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి

నారాయణరావుపేట, ఆగస్టు 17: పొటాష్‌ లోపం వల్లే వరిపొలాలు ఎర్రబడుతున్నాయని, పంట రక్షణ నివారణకు ఎకరానికి 20-25 కిలోల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలని లేదా 19:19:19: లీటర్‌ నీటికి 10 గ్రాములు పిచికారీ చేయాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి రైతులకు సూచించారు. బుధవారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపుర్‌, బంజేరుపల్లి గ్రామాల్లో వరి, పత్తి, కంది, పెసర పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. వరికి ఆకు ముడత పురుగు ఆశిస్తుందని గమనించామని, పంట నివారణకు లీటర్‌ నీటికి క్లోరిపైరిఫాస్‌ 2.5 పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ విజయ్‌, శాస్త్రవేత్త సరిత, వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున్‌, సర్పంచులు దేవయ్య, శంకర్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:35:27+05:30 IST