ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-03-17T05:10:01+05:30 IST

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ పోలీసులకు సూచించారు. బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించాలి

 నేర సమీక్షలో సంగారెడ్డి, మెదక్‌ ఎస్పీలు రమణకుమార్‌, రోహిణి ప్రియదర్శిని


సంగారెడ్డిక్రైం, మార్చి 16: ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ పోలీసులకు సూచించారు. బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. లాటరీల పేరిట జరిగే మోసాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా గంజాయిని సాగు చేసినా, నిల్వ చేసినా, విక్రయించినా వారిపై ఉక్కుపాదం మోపుతామని, పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రైతులు గంజాయి సాగు చేస్తే వారికి ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని, ఆ భూమిని తహసీల్దార్‌కు అప్పగిస్తామని హెచ్చరించారు.  కేసు దర్యాప్తులో నేర స్థల ఫొటోగ్రఫీ చాలా కీలకమన్నారు. నేరాల అదుపులో భాగంగా ఆయా సబ్‌ డివిజన్లలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించాలని డీఎస్పీలకు సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ నితికపంత్‌, డీఎస్పీలు ఎ.బాలాజీ, భీంరెడ్డి, శంకర్‌రాజు, సత్యనారాయణ రాజు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు, డీసీఆర్‌బీ సీఐ రాంబాబు, ఎస్‌ఐ అంజిరెడ్డి, పరమేశ్వర్‌, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


నేరాల నియంత్రణకు ప్రణాళికతో సాగాలి

మెదక్‌ అర్బన్‌, మార్చి16: నేరాల నియంత్రణకు ప్రణాళికతో సాగాలని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసులు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో మాట్లాడారు. నేర నియంత్రణతోపాటు పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. వారెంట్స్‌, సమన్స్‌, వర్టికల్స్‌లో ఆయా పోలీస్‌ స్టేషన్ల పనితీరును పరిశీలించారు. సివిల్‌ కేసుల్లో జోక్యం చేసుకోరాదని చెప్పారు. మహిళా రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డా. బాలస్వామి, మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు సైదులు, కిరణ్‌కుమార్‌తోపాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T05:10:01+05:30 IST