మల్కాపూర్‌లో పూరిగుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2022-03-17T04:26:03+05:30 IST

మల్కాపూర్‌లో బుధవారం ఉదయం పల్లెపాటి గణేశ్‌కు చెందిన పూరిగుడిసెలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఏర్పడి దగ్ధమైంది.

మల్కాపూర్‌లో పూరిగుడిసె దగ్ధం

తూప్రాన్‌రూరల్‌, మార్చి 16: మల్కాపూర్‌లో బుధవారం ఉదయం పల్లెపాటి గణేశ్‌కు చెందిన పూరిగుడిసెలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఏర్పడి దగ్ధమైంది. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఉపాధి పనులకు వెళ్లారు. చుట్టుపక్కలవారు గమనించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో రూ.50వేల నగదుతో పాటు బట్టలు, బియ్యం, వంటసామగ్రి దగ్ధమయ్యాయని బాధితుడు గణేశ్‌ తెలిపారు. రెవెన్యూ అధికారులు  50కిలోల బియ్యం అందజేయగా, సర్పంచ్‌ మహాదేవి, ఉపసర్పంచ్‌ ఆంజనేయులుగౌడ్‌ ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Read more