ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-06T05:23:57+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 


నారాయణఖేడ్‌/పెద్దశంకరంపేట, జూలై 5: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రెండు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జడ్పీటీసీ విజయరామరాజు, రైతుబంధు అధ్యక్షుడు సురే్‌షగౌడ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీ వీణసుభా్‌షగౌడ్‌, స్వప్నరాజేశ్వర్‌, సర్పంచులు అలుగుల సత్యనారాయణ, సుధాకర్‌, తహసీల్దార్‌ చరణ్‌సింగ్‌, నాయకులు అంజయ్య, పున్నయ్య, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ మండల పరిధిలోని పీర్ల తండాకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సేవాలాల్‌సంఘం నాయకులు రమేష్‌ చౌహాన్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా పీర్ల తండాకు ఎమ్మెల్యే వెళ్తున్న సమయంలో నెమలి అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్‌ అదుపుతప్పి బానోత్‌శివాజీ కిందపడ్డాడు. ఎమ్మెల్యే తన వాహనంలోంచి దిగి శివాజీని మరో వాహనంలో ఖేడ్‌ ఏరియా వైద్యశాలకు పంపించి, వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఎంబీఆర్‌ ఫౌండేషన్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు ఎమ్మెల్యే ఉచితంగా పుస్తకానలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌బుజ్జి, మాజీ సర్పంచు నజీబ్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగన్‌చారి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కళింగక్రిష్ణకుమార్‌, టీఆర్‌ఎ్‌సవీ నియోజకవర్గ అధ్యక్షుడు అంజాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అభిషేక్‌ షెట్కార్‌, నగేష్‌, సంగప్ప పాల్గొన్నారు.


 

Updated Date - 2022-07-06T05:23:57+05:30 IST