విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించండి

ABN , First Publish Date - 2022-09-09T05:24:23+05:30 IST

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించండి

  జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు


సంగారెడ్డి రూరల్‌, సెప్టెంబరు 8: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు సూచించారు. సంగారెడ్డి, జోగిపేట పట్టణాల్లో గురువారం మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్‌ బాలికల రెసిడెన్సియల్‌ స్కూల్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు. విద్యాబోధన, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.


 

Read more