కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు

ABN , First Publish Date - 2022-09-18T05:27:34+05:30 IST

ప్రధాని మోదీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా నిర్వహించాలని యువజన కాంగ్రెస్‌ పిలుపుమేరకు ఖేడ్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు

 నారాయణఖేడ్‌/హవేళిఘనపూర్‌/జోగిపేట, సెప్టెంబరు 17: ప్రధాని మోదీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా నిర్వహించాలని యువజన కాంగ్రెస్‌ పిలుపుమేరకు ఖేడ్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకే్‌షషెట్కార్‌ ఆధ్వర్యంలో చాయ్‌, తోపుడుబళ్లపై పండ్లు అమ్ముతూ, పాస్ట్‌ఫుడ్‌ విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సాగర్‌షెట్కార్‌, సంగమేశ్వర్‌పటేల్‌, సంతోష్‌, సాయిచరణ్‌, ఖలీద్‌, విజయ్‌స్వామి, సాయినాథ్‌, ఉస్మాన్‌, భూపాల్‌, సతీష్‌, శ్రీను పాల్గొన్నారు. హవేళిఘనపూర్‌లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు రాములు, ఆదిల్‌ పాషా, రవీందర్‌గౌడ్‌, లింగాల సంతోష్‌ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జోగిపేటలో చాయ్‌ తయారు చేసి అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్‌.సురేందర్‌గౌడ్‌, రంగ సురేశ్‌గుప్తా, చిట్టిబాబు, డాకూరి శంకర్‌, హరిక్రిష్ణాగౌడ్‌, నాయకులు డీజీ వెంకటేశం, ప్రవీణ్‌, భాస్కర్‌, డాకూరి శ్రీనివాస్‌, యాదయ్య, అనిల్‌, అలీ అబ్బాస్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.


 

Read more