బ్యాంకుల్లో మోసాలను అరికట్టండి

ABN , First Publish Date - 2022-07-19T05:24:20+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల బ్యాంకుల్లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కోరారు.

బ్యాంకుల్లో మోసాలను అరికట్టండి

 దుర్వినియోగమైన నిధుల రికవరికీ చర్యలు తీసుకోండి

 లోక్‌సభ స్పీకర్‌ను కోరిన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 18: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల బ్యాంకుల్లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కోరారు. లోక్‌సభ రూల్‌ 377 కింద ఆయన ఈ మేరకు నోటీసు ఇచ్చారు. ఆయా బ్యాంకులలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారి నుంచి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్‌ బ్యాంకుల కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే మోసాలు ఎక్కువగా జరిగాయని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. 2019-21 సంవత్సరానికి గాను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.2.94 లక్షల కోట్లు దుర్వినియోగం జరగగా, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో రూ.86.355 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాంకుల్లో జరిగిన మోసాలతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని 2019 పంద్రాగస్టు రోజు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నీటి మూటలేనని తేలిపోయిందని ఎంపీ విమర్శించారు. 

Updated Date - 2022-07-19T05:24:20+05:30 IST