ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’

ABN , First Publish Date - 2022-12-13T00:10:17+05:30 IST

ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’
అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌లు

అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 12 : ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధితులెవరూ తిరిగి ప్రజావాణికి వచ్చి అర్జీ పెట్టకోకుండా ముందే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌ అర్జీలపైనే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, రెండు పడక గదులు ఇళ్లు, ఆసరా పింఛన్ల, ఇతర సమస్యలు కలిపి మొత్తం 84 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:10:17+05:30 IST

Read more