సంతలో తెగిపడిన విద్యుత్‌ తీగలు

ABN , First Publish Date - 2022-07-06T05:27:21+05:30 IST

నారాయణఖేడ్‌ సంతలో మంగళవారం విద్యుత్‌ తీగలు తెగి పడడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

సంతలో తెగిపడిన విద్యుత్‌ తీగలు

 నారాయణఖేడ్‌, జూలై 5: నారాయణఖేడ్‌ సంతలో మంగళవారం విద్యుత్‌ తీగలు తెగి పడడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని గణేష్‌ మందిర్‌ ప్రాంతంలో వారాంతపు సంతను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధిక సంఖ్యలో జనం ఉన్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తున్న క్రమంలోనే విద్యుత్‌ తీగలు తెగి పడిపోయాయి. తీగలు తగిలి దుకాణాలకు కరెంట్‌ షాక్‌ రావడంతో వ్యాపారులు, ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. విద్యుత్‌ అధికారులకు సమాచారం అందజేయడంతో సరఫరాను నిలిపివేశారు.


 

Read more