పరిహారం చెల్లించాకే ట్రయల్‌ రన్‌ నిర్వహించండి

ABN , First Publish Date - 2022-06-11T05:33:25+05:30 IST

తమకు రావాల్సిన పరిహారం డబ్బులు చెల్లించిన తర్వాతనే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని భూ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు.

పరిహారం చెల్లించాకే ట్రయల్‌ రన్‌ నిర్వహించండి
గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట వద్ద ధర్నా చేస్తున్న భూనిర్వాసితులు


గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద భూనిర్వాసితుల ధర్నాఅక్కన్నపేట, జూన్‌ 10: తమకు రావాల్సిన పరిహారం డబ్బులు చెల్లించిన తర్వాతనే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని భూ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలోని ప్రాజెక్టు కట్ట వద్ద ధర్నా నిర్వహించారు. పరిహారం అందని బాధితులు దీక్షలు చేపట్టి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లతో పాటు పరిహారం డబ్బులు ఇచ్చిన తర్వాతనే ట్రయల్‌ రన్‌ కార్యక్రమం చేపట్టాలని కోరారు. లేదంటే ట్రయల్‌ రన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసనలో సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డి ,భూ నిర్వాసితులు పాల్గొన్నారు.


Read more