పెండింగ్‌ కెనాల్‌ భూసేకరణ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-09T05:17:02+05:30 IST

పెండింగ్‌లో ఉన్న కెనాల్‌ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ కెనాల్‌ భూసేకరణ వేగవంతం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 8: పెండింగ్‌లో ఉన్న కెనాల్‌ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. రంగనాయకసాగర్‌ కాలువ పెండింగ్‌ భూసేకరణపై చర్చించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్‌ కెనాల్‌ నిర్మాణానికి నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలంలో అవసరమై పెండింగ్‌లో ఉన్న భూములను ఇరిగేషన్‌ అధికారులతో కలిసి పరిశీలించి భూసేకరణ విజయవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, ఇరిగేషన్‌ ఈఈలు, తహసీల్దార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Read more