అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపిక

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

అథ్లెటిక్స్‌లోని వివిధ విభాగాల్లో అండర్‌-12, 14, 16, 18 కేటగిరీల్లో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ట్రైనింగ్‌ సెంటర్‌, స్టేట్‌ లెవల్‌ ఖేలో ఇండియా సెంటర్‌ (హాస్టల్‌) సోమవారం మెదక్‌ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి.

అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపిక
పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు

మెదక్‌ అర్బన్‌, జూలై 18: అథ్లెటిక్స్‌లోని వివిధ విభాగాల్లో అండర్‌-12, 14, 16, 18 కేటగిరీల్లో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ట్రైనింగ్‌ సెంటర్‌, స్టేట్‌ లెవల్‌ ఖేలో ఇండియా సెంటర్‌ (హాస్టల్‌) సోమవారం మెదక్‌ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తొలి రోజు  98 మంది క్రీడాకారులకు ఎత్తు, బరువు, వర్టికల్‌ జంప్‌, 30 మీటర్ల పరుగు పందెం, బాల్‌త్రో, షటిల్‌ రన్‌ తదితర విభాగాల్లో ఫిజికల్‌ టెస్టులు నిర్వహించారు. మంగళవారం కూడా ఎంపికలు కొనసాగుతాయని స్పోర్ట్ప్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ డా. శరత్‌ చంద్రయాన్‌ పేర్కొన్నారు.  పోటీల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఉచిత భోజనం, వసతితో కూడిన అథ్లెటిక్స్‌ శిక్షణ అందిస్తారని ఆయన వెల్లడించారు.  కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా అఫీషియల్‌ సుబ్బారావు, అథ్లెటిక్స్‌ కోచ్‌, మెదక్‌ హాస్టల్‌ ఇన్‌చార్జి ప్రసాద్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మధుసూదన్‌, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Read more