కొనసాగుతున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-09T23:55:22+05:30 IST

స్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు రెండోరోజు కొనసాగాయి. శుక్రవారం 800 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 672 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

కొనసాగుతున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు
దేహదారుఢ్య పరీక్షల్లో లాంగ్‌ జంప్‌ చేస్తున్న అభ్యర్థి

రెండోరోజు 672 మంది హాజరు

ఎస్పీ పర్యవేక్షణలో ఎంపికలు

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 9 : ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు రెండోరోజు కొనసాగాయి. శుక్రవారం 800 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 672 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 264 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. సంగారెడ్డిలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌ పరీక్షలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షల్లో అర్హత సాధించని వారు ఎవరూ కూడా అధైర్యపడకూడదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే అనేక పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు. ఆయన వెంట సంగారెడ్డి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-09T23:55:23+05:30 IST