కొనసాగుతున్న ‘కస్తూర్బా’ భవన నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2022-12-06T23:31:30+05:30 IST

చేర్యాల, డిసెంబరు 6: కొమురవెల్లి మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న ‘కస్తూర్బా’ భవన నిర్మాణ పనులు

చేర్యాల, డిసెంబరు 6: కొమురవెల్లి మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆరేళ్ల క్రితం కొమురవెల్లిని మండలంగా ఏర్పాటుచేసిన కొన్నాళ్ల తర్వాత ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలను మంజూరుచేసింది. సొంత భవన లేకపోవడంతో రాంసాగర్‌ గ్రామశివారులోని కురుమసత్రంలో గదులను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. 210 మంది విద్యార్థులు చదువుతున్నా మౌలిక వసతులు, చుట్టుపక్కల వాతావరణం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయితే సొంత భవన నిర్మాణానికి స్థలం లేకపోవడంతో నిధుల మంజూరుకు జాప్యం ఏర్పడింది. గతంలో సీఎం కేసీఆర్‌ మల్లన్న ఆలయానికి కేటాయింపజేసిన రాజీవ్‌ రహదారి సమీపంలోనిప్రభుత్వ భూమిలో నుంచి కొంత స్థలాన్ని కేటాయించారు. దీంతో రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంతో గతేడాది డిసెంబరు 17న ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించారు. ముందు పనులు వేగవంతమైనా కొద్దిరోజుల నుంచి మందకొడిగా సాగుతున్నాయి. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తిచేయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-12-06T23:31:31+05:30 IST