19న ‘చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి’

ABN , First Publish Date - 2022-12-13T00:11:37+05:30 IST

స్సీ వర్గీకరణ సాధనకు ఈనెల 19వ తేదీన చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

19న ‘చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి’
మంత్రి హరీశ్‌రావుకు ఆహ్వానపత్రం అందజేస్తున్న వంగపల్లి శ్రీనివాస్‌

మంత్రి హరీశ్‌ను ఆహ్వానించిన వంగపల్లి

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు12 : ఎస్సీ వర్గీకరణ సాధనకు ఈనెల 19వ తేదీన చలో ఢిల్లీ.. మాదిగల లొల్లి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. అనంతరం వంగపల్లి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి విస్మరించిందని విమర్శించారు. 9 ఏళ్లు గడుస్తున్నా మోక్షం లేదన్నారు. మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈనెల 19న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-13T00:11:37+05:30 IST

Read more