అధికారులు సకాలంలో హాజరు కావాలి

ABN , First Publish Date - 2022-09-22T05:28:27+05:30 IST

అధికారులు మండల పరిషత్‌ సమావేశానికి సకాలంలో హాజరు కావాలని మనోహరాబాద్‌ ఎంపీపీ పురం నవనీతారవి సూచించారు.

అధికారులు సకాలంలో హాజరు కావాలి

 మండల సమావేశంలో ఎంపీపీ నవనీత


తూప్రాన్‌ (మనోహరాబాద్‌), సెప్టెంబరు 21: అధికారులు మండల పరిషత్‌ సమావేశానికి సకాలంలో హాజరు కావాలని మనోహరాబాద్‌ ఎంపీపీ పురం నవనీతారవి సూచించారు. అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ఆమె ఆగ్రహించారు. బుధవారం మనోహరాబాద్‌లో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో పశువులకు సరైన వైద్యం అందడంలేదని, సమావేశంలో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్యలు తీర్చడంలేదని, కాళ్లకల్‌లో అధికారులు అందుబాటులో ఉండడం లేదని సర్పంచు నత్తి మల్లేశ్‌ పేర్కొన్నారు. నిధులున్నా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌ చేపట్టడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా రంగాయపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణ బిల్లు రాకపోవడంతో సర్పంచు నాగభూషణం సమావేశానికి రాలేదన్నారు. బిల్లులు చెల్లింపులో ఆలస్యం కాకుండా చూడాలని విఠల్‌రెడ్డి కోరారు. సమావేశంలో ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్దారు భిక్షపతి, ఎంపీవో లక్ష్మీనర్సింహులు పాల్గొన్నారు.


 

Read more