సరైన పరిహారం ప్రకటించే వరకు సర్వే వద్దు

ABN , First Publish Date - 2022-10-02T05:21:59+05:30 IST

రీజినల్‌ రింగురోడ్డు కోసం భూములను కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం ప్రకటించే వరకు ఆ భూముల్లో సర్వే చేయవద్దంటూ శనివారం మండలంలోని కొంతాన్‌పల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు.

సరైన పరిహారం ప్రకటించే వరకు సర్వే వద్దు
సర్వేను అడ్డుకుంటున్న కొంతాన్‌పల్లి రైతులు

కొంతాన్‌పల్లిలో సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు

శివ్వంపేట, అక్టోబరు 1: రీజినల్‌ రింగురోడ్డు  కోసం భూములను కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం ప్రకటించే వరకు ఆ భూముల్లో సర్వే చేయవద్దంటూ శనివారం మండలంలోని కొంతాన్‌పల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. త్రిబుల్‌ఆర్‌ కోసం నర్సాపూర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ఆ్‌ఫ సర్వేయర్‌ శేఖర్‌వర్మ, శివ్వంపేట మండల సర్వేయర్‌ యాదగిరి కొంతాన్‌పల్లి సమీపంలో సర్వే కోసం రాగా సుమారు 50మంది రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోడ్డులో భూమిని కోల్పోతున్నవారంతా ఎకరం, అరెకరం ఉన్న పేద రైతులేనని, రోడ్డు కోసం భూములిస్తే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. తమ భూములకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ప్రకారం పరిహారం చెల్లిస్తేనే సర్వేకు ఒప్పుకుంటామని తెలిపారు. 

Read more