సంగారెడ్డిలో ‘నీట్‌’ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-07-18T05:58:11+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ అర్హత పరీక్ష సంగారెడ్డిలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డిలోని సెయింట్‌ ఆంథోనీస్‌ జూనియర్‌ కళాశాల, సెయింట్‌ ఆంథోనీస్‌ డిగ్రీ కళాశాల, సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌, ఎస్‌వీ జూనియర్‌ కళాశాల, సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌, పయనీర్స్‌ హైస్కూల్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల

సంగారెడ్డిలో ‘నీట్‌’ పరీక్ష ప్రశాంతం

పరీక్ష రాసిన 2,211 మంది విద్యార్థులు


సంగారెడ్డి అర్బన్‌, జూలై 17 : వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ అర్హత పరీక్ష సంగారెడ్డిలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డిలోని సెయింట్‌ ఆంథోనీస్‌ జూనియర్‌ కళాశాల, సెయింట్‌ ఆంథోనీస్‌ డిగ్రీ కళాశాల, సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌, ఎస్‌వీ జూనియర్‌ కళాశాల, సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌, పయనీర్స్‌ హైస్కూల్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 2,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,211 మంది హాజరైనట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సంగారెడ్డి సిటీ కోఆర్డినేటర్‌ జ్యోతిరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఆరుగురు అబ్జర్వర్లు, ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌బృందాలు పరిశీలించాయి. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అభ్యర్థుల ఫోటోలను ట్యాబ్‌లో  నిక్షిప్తం చేశారు. అభ్యర్థులు బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను కేంద్రంలోకి తీసుకు వెళ్లేందుకు అనుమతించలేదు. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-07-18T05:58:11+05:30 IST