నీటి వినియోగ బిల్లు బకాయిలపై అధికారుల నజర్‌

ABN , First Publish Date - 2022-11-30T23:33:01+05:30 IST

చేర్యాల, నవంబరు 30: చేర్యాల మున్సిపల్‌ పరిధిలో పేరుకుపోయిన నీటి వినియోగ బిల్లు బకాయిల వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

నీటి వినియోగ బిల్లు బకాయిలపై అధికారుల నజర్‌

రెండేళ్ల బకాయి డబ్బు చెల్లించిన చైర్‌పర్సన్‌

చేర్యాల, నవంబరు 30: చేర్యాల మున్సిపల్‌ పరిధిలో పేరుకుపోయిన నీటి వినియోగ బిల్లు బకాయిల వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మేరకు వార్డుల వారీగా ప్రత్యేకంగా టీంలను ఏర్పాటుచేసి ఇంటింటికి వెళ్లి మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గతంలో ఉచితంగా కనెక్షన్లు ఏర్పాటు చేయగా, మున్సిపల్‌ ఆదాయం, మౌలిక వసతుల కల్పనపేరిట 2018 నుంచి పేరుకుపోయిన సుమారు రూ.కోటి 50 లక్షల బకాయిలను రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టింది. బుధవారం నుంచి వార్డులవారీగా టీంలు బయలుదేరగా, వసూలుకు తమ ఇంటికి వచ్చిన సిబ్బందికి చైర్‌పర్సన్‌ స్వరూపారాణి నీటి వినియోగ బిల్లు బకాయిలు చెల్లించారు. రెండేళ్లకు సంబంధించిన రూ..1,440 నగదును అందజేశారు.

Updated Date - 2022-11-30T23:33:01+05:30 IST

Read more