ముదిరాజ్‌లు ఐక్యంగా ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-08-18T04:34:09+05:30 IST

ముదిరాజ్‌లు ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్‌ కొట్టాల యాదగిరి అన్నారు.

ముదిరాజ్‌లు ఐక్యంగా ఉద్యమించాలి

ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు యాదగిరి

జగదేవ్‌పూర్‌, ఆగస్టు 17: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకుడు, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్‌ కొట్టాల యాదగిరి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో ముదిరాజ్‌ సంఘం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం ముదిరాజ్‌ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ముదిరాజ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా అన్నివిధాలుగా రాణించాలని సూచించారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చారని, బీసీ-ఏలోని కులస్తులు హైకోర్టులో కేసు స్టే తీసుకొచ్చారని గుర్తు చేశారు. కోర్టులో ముదిరాజ్‌లకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం సభ్యులు రమేష్‌, బలరాం, రాజయ్య, సత్యనారాయణ, పరమేశ్వర్‌, ధర్మారం సర్పంచ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముదిరాజ్‌ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగదేవ్‌పూర్‌కు చెందిన రాగుల రాజుముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శులుగా నర్ర సుదర్శన్‌, రాజపేట చంద్రం,  కోశాధికారిగా కొంపల్లి శీనులతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2022-08-18T04:34:09+05:30 IST