పాలమాకులలో ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-01-04T04:48:27+05:30 IST

పాలమాకులలోని వేంకటేశ్వరాలయంలో సోమవారం గోదారంగనాథస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటకు చెందిన వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాలమాకులలో ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణం
ఆలయంలో గోదారంగనాథస్వామి కల్యాణోత్సవం

నంగునూరు, జనవరి3: పాలమాకులలోని వేంకటేశ్వరాలయంలో సోమవారం గోదారంగనాథస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటకు చెందిన వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు డింగరి రంగాచార్యులు ధనుర్మాసం పరమ పవిత్ర మాసమని పేర్కొన్నారు. గోదా, రంగనాథస్వామి కల్యాణ విశిష్టతను క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో సేనాపతి రామాచార్యులు, మరింగంటి వెంకటరమణాచార్యులు, ఆలయ పూజారి విష్ణుతేజ, ఆలయ కమిటీ చైర్మన్‌ కాశీనాథం, దుర్గయ్య, మల్లేశం, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read more