మోదీకి తొత్తులా సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-17T05:20:13+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఒకరిపైఒకరు దూషించుకొంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీకి తొత్తులా సీఎం కేసీఆర్‌
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపాటు

కాంగ్రెస్‌ నాయకుల పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు


సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ ఒకరిపైఒకరు దూషించుకొంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని రాష్ట్రంలోని ఆయా పోలీ్‌సస్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. 

టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేటలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీస్‌ కమిషనరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఉదయమే నాయకులు, కార్యకర్తలను ముందుస్తుగా అరెస్టు చేశారు. అయినా పోలీసులు నిర్బంధాలను ఛేదించుకొని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సిద్దిపేట జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తరలివచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Updated Date - 2022-02-17T05:20:13+05:30 IST